T20 World Cup : సింహంలా విజృంభిస్తున్న భారత్ Team India Records || Oneindia Telugu

2021-11-06 984

ICC T20 World Cup 2021: List of records India shattered with huge win against Scotland in T20 World Cup

#T20WorldCup2021
#INDVsSCO
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#NZVSAFG
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్‌ 2021లో వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న భారత్.. గ్రూప్‌-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్‌ రేట్‌ను భారీగా మెరుగు పర్చుకుంది. నాకౌట్‌ చేరాలంటే అద్భుతం జరుగాల్సిన స్థితిలో శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. ముందుగా రవీంద్ర జడేజా (3/15), మహమ్మద్‌ షమీ (3/15), జస్ప్రీత్‌ బుమ్రా (2/10) సత్తాచాటడంతో స్కాట్లాండ్‌ 85 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో లోకేశ్‌ రాహుల్‌ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్‌ 6.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 89 పరుగులు చేసింది.